ఎలాంటి షరతులు లేకుండా సీసీఐ కేంద్రాలలో పత్తిని కొనుగోలు చేయాలి

*అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్

సాక్షి డిజిటల్ న్యూస్ పినపాక ప్రతినిధి నవంబర్ 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో పత్తి సాగు చేసే రైతులు అధిక మొత్తంలో ఉన్నందున కౌలు చేసే రైతులు గాని సొంతంగా చేసుకునే రైతులు గాని పండించిన పత్తిని మద్దతు ధరతో పత్తి కొనుగోలు కేంద్రాలలో తీసుకోవాలని,తుఫాన్ వల్ల వర్షాల కారణంగా పత్తి రైతులు చాలా ఇబ్బందులు ఏదూరుకున్నారు, పర్యావరణం వల్ల జరిగిన నష్టాన్ని పరిధిలో తీసుకోకుండా రైతుల పండించిన పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులు విద్యా అవగాహన గాని సంబంధిత ఆన్లైన్ యాప్ అవగాహన కూడా పరిగణంలోకి తీసుకోకుండా పత్తి ని సీసీఐ కొనుగోలు చెయ్యాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాము, రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు, కొనుగోలు చెయ్యకుండా రైతులను ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో అధికారులు గానీ సీసీఐ కేంద్రాలు గాని చేస్తే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరుఫున ఇబ్బందులకు గురవుతున్న రైతుల తో సంబంధిత కేంద్రాల వద్ద అగ్రికల్చర్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమలు చేస్తామని అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *