సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి నవంబర్ 05: కె.కోటపాడు అయ్యన్న జూనియర్, డిగ్రీ కళాశాలలు జోగన్నపాలెం, కింతాడ గ్రామాల్లో ప్రారంభించిన జాతీయ సేవా పధకం (ఎన్.ఎస్.ఎస్.) ప్రత్యేక శిబిరం నాలుగవ రోజయిన మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తోన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రంపై ప్రత్యేక దృష్టిసారించారు.ఎన్.ఎస్.ఎస్. పీఓ సీముసురు రమణ ఆధ్వర్యంలో కింతాడ సమీపంలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వాలంటీర్స్ తుప్పలను తొలగించారు. కాయగూరలు, పండ్లు, పూలమొక్కల వద్ద శ్రమదానంతో గార్డెనింగ్ చేశారు. గేటు నుంచి షెడ్ వరకూ సిమెంట్ ఇటుకలతో తోవను నిర్మించారు.ఇదిలా ఉండగా జోగన్నపాలెంలో జూనియర్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్. పీఓ గాడి అప్పారావు ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ వాలంటీర్లు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ శిబిరాన్ని తెలుగు దేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కన్నూరు సూర్య నారాయణ ప్రారంభం చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ శ్రీనివాసరావు పశువులకు వైద్యం చేశారు. వాలంటీర్లు పశువులకు వైద్య సేవలు అందించారు. ఈ సేవా కార్యక్రమంలలో అయ్యన్న జూనియర్,అయ్యన్న డిగ్రీ కాలేజీల అధ్యాపకులు సుశీల, దుర్గాదేవి, కళ్యాణి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.
