ఈ నెల 6న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.

*జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.శ్రీరామ్.

సాక్షి డిజిటల్ న్యూస్:5 నవంబర్,పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు.సేల్స్ కన్సల్టెంట్(male) 13 పోస్టులకు గాను,ఏదైనా డిగ్రీ,టూ వీలర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.సర్వీస్ అడ్వైజర్ 2 పోస్టులకు గాను డీజిల్ మెకానిక్/బీ.టెక్ మెకానిక్ పూర్తి చేసి,వయసు 22 -30 ఏళ్ల వరకు ఉండాలన్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 6న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉదయం 10 గంటలకు,అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరుకావాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *