సాక్షి డిజిటల్ న్యూస్ జమ్మికుంట నవంబర్ 04 2025 , రిపోర్టర్ డి మహేందర్ ఇటీవల వంగర గురుకులంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వనం శ్రీ వర్షిత కుటుంబాన్ని పరామర్శించి మన బహుజన సంస్కృతిని పరిచయం చేస్తూ స్వేరో పలకరింపు కార్యక్రమం చేయడం జరిగింది. స్వేరో నెట్వర్క్ ఫౌండర్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో వారి కుటుంబానికి ఫోన్లో మాట్లాడించి ఓదార్పు అందించడం జరిగింది. తమ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు స్వేరోస్ అండగా ఉంటారని మరే కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకుండా గట్టి పోరాటం చేస్తామని, శ్రీ వర్షిత ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరో మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకినపల్లి శిరీష, రాష్ట్ర కో కన్వీనర్ గడప రాజు, డివిజనల్ అధ్యక్షులు మారపల్లి రాజేష్, డివిజనల్ ఉపాధ్యక్షులు ఎర్ర ప్రదీప్, సీనియర్ స్వేరో వెంకన్న, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.