ఆన్‌లైన్ వ్యాపార మోసాలలో ఇద్దరు నిందితుల అరెస్ట్ : జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్

*2 మొబైల్ ఫోన్లు, డెబిట్ & క్రెడిట్ కార్డులు,క్యాష్ బిల్ బుక్స్, కోటేషన్ బుక్, మారుతీ డిజార్ కార్ స్వాదినం

సాక్షి డిజిటల్ నవోంబర్ 05 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ వ్యాపార మోసాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఫిర్యాదుదారుడు ఎక్కల దేవి కృష్ణ (43) మార్కండేయ వీధి, జగిత్యాల టౌన్ నివాసి, ఇటీవల ఆన్‌లైన్ ద్వారా వ్యాపార లావాదేవీలలో మోసపోయినట్లు జగిత్యాల పట్టణ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణ లో బాగంగా ఈ క్రింది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల వివరాలు A-1:పస్పూల శ్రీధర్ నిర్మల్ టౌన్. A-2: కొత్వాక్ క్రిష్ణ ఇద్గం, నిర్మల్ టౌన్ పైన తెలిపిన నిందితులు సిమెంట్ మరియు ఇల్లుకు సంబంధించిన ఐరన్ ఇతర సామాన్లు మా దగ్గర ఉన్నాయని గూగుల్ క్రోమ్ ద్వార అడ్రస్సు లు వెతికి పెద్ద పెద్ద షాపుల వారి దగ్గర ఆర్డర్ చేసి చిన్న షాపుల వారికి పంపిస్తూ చిన్న షాప్ ల దగ్గర నుండి డబ్బులు పర్సనల్ ఫోన్ నెంబర్లకు మరియు అకౌంటు ల కు ఫోన్ పే చేయించుకుంటూ ఏపీ మరియు తెలంగాణలోని పలు షాపులలో మోసం చేసి దాదాపు 12,64,000/- రూపాయలు మోసగించి జగిత్యాల లోని RDO చౌరస్తా వద్ద గల అమూల్య ఆన్లైన్ సెంటర్లో పై విధంగా మోసగించిన డబ్బులను ఆన్లైన్ సెంటర్ యజమానికి పంపించి తీసుకునగా వెంటనే ఫిర్యాదుదారుడి యొక్క అకౌంట్ ఫ్రీజ్ కాగా ఫిర్యాదుదారుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపగా పైన నిందితులు ఇద్దరు చేసిన మోసాలను విచారణ చేయగా వీరిపై గతంలో పలు చోట్ల దాదాపు 15 కేసు ల కు పైగా నమోదైనవి మరియు ఈరోజు జగిత్యాల కొత్త బస్టాండ్ ఏరియాలో కారు TS-18-T-7507 లో వస్తుండగా వారిని పట్టుకుని తగు విచారణ జరిపి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి రిమాండ్కు తరలించడం జరిగినది .ఈ యొక్క నిందితులను పట్టుకోవడం లో కృషి చేసిన సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ ,టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,సైబర్ క్రైమ్ ఎస్. ఐ కృష్ణ మరియు సిబ్బంది ని జిల్లా ఎస్పి గారు అభినదించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *