ఆదాడ ఆధ్వర్యంలో వివిధ సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5.. బలిజిపేట మండలం రిపోర్టర్ మురళి బలిజిపేట మండలంలోని అరసాడ నారాయణపురం వంతరామ్ గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై మన్యం జిల్లా కలెక్టర్ కు పార్వతీపురం లో వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను కారణంగా రైతులు కష్టార్జితం ఆరుగాల పంట నీటి మునిగి భారీ స్థాయిలో నష్టపోయారని వాటి విషయంలో క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపి సంబంధిత రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు అనంతరం అరసాడ గ్రామంలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల తొలగింపు పై అన్యాయం జరిగిందని ఏ కారణము లేకుండా వారిని తొలగించడం సరైన పద్ధతి కాదని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపి గిరిజనల, రజకుల కు అక్కడ జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరారు అలాగే ఒంతరాం గ్రామంలో వేగవతి నది ప్రవాహం వలన గ్రామ ప్రజలు ఊరు నుండి బయటకు వెళ్లే రహదారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ గ్రామంలో నీటి ప్రవాహం గ్రామంలోకి రాకుండా ప్రహరీ గోడ నిర్మించాలని అలాగే వరదల సమయంలో గ్రామం నుండి ప్రజలు బయటకు వెళ్లే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. నారాయణ పురం గ్రామంలో కూడా కూరగాయల పంటలు రైతులు వందకు వంద శాతం నష్టపోయారని వారికి నష్టపరిహారం పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పడాల జయరాం, మురళి సురేష్ తిరపతి రావు పార్వతి ఈశ్వరమ్మ కృష్ణ గణపతి చిన పార్వతీ తదితరులు పాల్గొన్నారు