ఎమ్ ఎల్ సి మేరీగ మురళీధర్, సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 4 కోట మండల, తిరుపతి జిల్లా: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు మోసం చేశారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్ మండి పడ్డారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం కోట మండలంలోని చిట్టెడు, ఉనుగుంటపాలెం, మద్దాల గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మేరీగా మురళీధర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన వక హాస్పిటల్ గాని మెడికల్ కళాశాల గాని తీసుకురాలేదన్నారు.జగన్మోహనరెడ్డి ఒకే సారి 17ప్రభుత్వ కళాశాలలు తీసుకొచారన్నారు. ఇలాంటి కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్ వారికి అప్పగించారన్నారు. ప్రవేట్ వారు డబ్బులు లేకుండా సూది వేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తామంటూ యువతను, ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను, 50ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలను మోసగించారన్నారు. సి ఇ సి సభ్యులు కొడవలూరు దనంజయరెడ్డి మాట్లాడుతూ ఏ జబ్బులు ఎలా వస్తాయ్ తెలియదనీ అన్నిజబ్బులు చూపెట్టుకొనే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, దేవారెడ్డి నాగర్ రెడ్డి, చెంచు రాఘవరెడ్డి, నేదురుమల్లి హరీష్ రెడ్డి,జడ్పీటీసీ కోటయ్య, ఎంపీపీ దాసరి అంజమ్మ, పాముల సురేంద్ర, కనుపూరు జగదీష్, పుట్టా నారాయణ, గ్రామ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.