సాక్షి డిజిటల్ న్యూస్ 4 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు అతి పిన్న వయసులో ఆంధ్ర మోడల్ శాసనసభకు మండలంలోని కాశిపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని సింగంపల్లి వెంకట సాయిమేఘన ఎంపిక కాబడింది రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాడుగుల నియోజవర్గ స్థాయిలో మేకింగ్ ఇండియా వికసిత ఆంధ్ర రాజ్యాంగ ఆవశ్యకత పౌరుల హక్కులు బాధ్యతలు ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో జిల్లాలో 50 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులు పోటీ పడగా మేఘన విజేతగా నిలిచి అరుదైన గౌరవం దక్కించుకుంది ఆంగ్ల భాషలో అనర్గళంగా ప్రసంగించి అందరినీ ఆశ్చర్య పరిచింది విద్యార్థిని ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించురాజ్యాంగ దినోత్సవం రోజున అమరావతి అసెంబ్లీలో జరిగే మోడల్ అసెంబ్లీ సాక్షిగా అధ్యక్షా అంటూ తన వాణి వినపించబోతుంది మేఘనను విద్యార్థినికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు కొట్టానా రాంబాబు ను మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్ ఉమా ఉషారాణి సర్పంచ్ పేరెంట్స్ కమిటీ చైర్ పర్సన్ ఆదిరెడ్డి వరలక్ష్మి ఎంపీటీసీ వంటకు పైడితల్లమ్మ ఉపాధ్యాయ సిబ్బంది గ్రామ పెద్దలు అభినందించారు