సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 4, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామంలో జనసేన కామాంధుడి చేతిలో లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. అనంతరం మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తూ తూ మంత్రంగా ప్రకటించిన నజరానా ఏమాత్రం సరికాదని తక్షణమే 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఐదు ఎకరాల భూమిని ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆ కుటుంబానికి కల్పించాలని కోరారు. మరియు బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తక్షణమే లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించామని.. నిందితున్ని తక్షణమే శిక్షించాలని ఇలాంటివి మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఈసీ మెంబర్ పితాని బాలకృష్ణ , నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్ , కాశి బాలమణి కుమారి , మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు , రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాస రాజు ,వల్లభుని దొరబాబు , పెన్మెత్స చిట్టి రాజు, వాసు రాజు, రాఘవ రాజు , ఎంపీపీ మీరియం జ్యోతి మరియు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.