అతివృష్టి తో రైతన్నల కష్టాలు.ఆందోళన లో అన్నదాతలు.

*రైతులను ప్రభుత్వం చిత్త శుద్ధితో ఆదుకోవాలి. *కౌలు రైతుల కష్టాలు గట్టెక్కేనా.

సాక్షి డిజిటల్ న్యూస్ కొత్తగూడెం కాన్స్టెన్సీ ప్రతినిధి పనిత మార్కు నవంబర్ 5 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు రాష్ట్రంలో పంట చేల లో పారుతున్న నీరు బీడి భూములుగా మారిన పంట పొలాలు, జూలూరుపాడు చంద్రుగొండ సుజాత నగర్ మండలలో పత్తి పండించడంలో జిల్లాలో ఒక ప్రత్యేక స్థానాన్ని కనబరిచేది ,కొంతకాలంగా మిర్చి పండించడంలో కూడా రైతన్నలు ముందుకు వచ్చి మిర్చి పండిస్తున్నారు. మండలంలో దాదాపు వేయి నుంచి 10 వేల ఎకరాల వరకు మిర్చి దాదాపు 40 వేల ఎకరాల వరకు పత్తి పంట పండిస్తున్నారు.కానీ పంటలు పండుతాయి అనే ఆశ తప్ప, అప్పులు తీరే పరిస్థితి లేదు. అన్నదాత గా పిలవబడే రైతులు మాత్రం అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. గత నాలుగు సంవత్సరాల రైతులకు పత్తికి మద్దతు ధర లేకపోవడం, రెండోది మిర్చి కి వైరస్ కారణంగా పంట దిగుబడి రాకపోవడం, పండించిన పంట కు సరిగా గిట్టుబాటు ధర లేకపోవడం. ఇలాంటి కారణాలు అన్ని ఒక వంతు ఐతే పంటలపై రసాయనాల ఎరువులపై రైతులకు అవగాహన లేకపోవడం వైరస్ ఉధృతికి కారణమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. వీటికి తోడు నకిలీ విత్తనాలు పురుగుమందులు రైతు ను అప్పుల్లో కి కూరకపోవడాన కి ఒక కారణంగా చెప్పవచ్చు అని సంబంధిత రైతులు రైతు సంఘ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అతివృష్టితో సతమతమవుతున్న రైతులను, ఈ సంవత్సరం కురుస్తున్న వర్షాలు, రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. పంట కాలం మొదలై నాలుగు ఐదు నెలలు కావస్తున్న కనీసం పట్టుమని పది రోజులు వర్షం విరామం ఇచ్చిన దాఖలాలు లేవు పంట భూములు బీడీ భూములుగా మారి పంట మొక్కల కంటే గడ్డి జాతి మొక్కలు వేపు గా ఎదగడం తో రైతులు గడ్డి మందులను ఆశించాల్సినా పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న గడ్డి మందు కంపెనీలు రకరకాల పేర్లతో నకిలీ మందులు అవతారమేత్తయి. గడ్డి మందు కొట్టడం వలన గడ్డి చావకపోగా పంట ఎదుగుదల ఆగిపోయి ఎరుపు రంగులోకి మారి నాసిరకం మొక్కలు గా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను చూస్తే పత్తి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల కు పడిపోతుంది. వచ్చిన నాలుగైదు క్వింటా ల పత్తిలో సగం పత్తి నాసిరకం పత్తి గా పరిగణం లోకి తీసుకొని రేటు లో కోతలు రైతులకు వాతలు గా మారుతాయి. మిరప పంట పై వైరస్ ఉధృతి ప్రభావితం చూపుతుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల మిరప పంటపై వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెట్టుబడులు బాగా పెరిగాయి. రైతులు ఈ కష్టకాలం నుంచి బయట పడాలంటే ప్రభుత్వం తక్షణమే సంబంధిత అధికారులను మండలాల వారిగా పంటలను పరిశీలించి నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించే విధంగా ప్రభుత్వం అధికారులకు సూచనలు ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వం అన్నదాతలను సకాలంలో ఆదుకోవాలి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *