అకాల వర్షాలకి రైతన్న కంట కన్నీరు..

సాక్షి డిజిటల్ న్యూస్, జమ్మికుంట (రూరల్) నవంబర్ 04 2025, రిపోర్టర్ డి మహేందర్ జమ్మికుంట మండలంలో అధిక వర్షాలకి చేతికిచ్చిన పొలం కోయలేని స్థితిలో ఉండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. అధిక వర్షపాతం వలన కొన్ని ప్రాంతాలలో వడ్లు ఎండ పోయడానికి కూడా వీలు లేకుండా వర్షాలు పడడంతో మొలకలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితిని చూసి రైతులు కంట కన్నీరు కారుస్తున్నారు. ఇది ఒక ప్రకృతి విపత్తు కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్య రైతులకు కోతకు వచ్చిన పొలాల నుండి వరద పోతున్న రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం చేయవలసిందిగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో ఇంకా అప్పుల పాలు అవ్వాల్సి వస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 50 వేల రూపాయలు అందించవలసిందిగా రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.