42% బీసీ రిజర్వేషన్స్ పార్లమెంట్లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్ చేర్చి రక్షణ కల్పించాలి

సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 04,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక ఎన్నికల్లో విద్యా,ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్స్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని సోమవారం నాడు రామన్నపేట మండల ఎమ్మార్వో లాల్ బహదూర్ కి వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర ప్రభుత్వం బిల్ నెంబర్ మూడు,నాలుగు ద్వారా మార్చ్ 2025న విద్యా,ఉద్యోగాలు సంస్థల్లో42% శాతం పెంచుతూ ఆమోదించింది.ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత కేంద్రాన్ని పంపబడి ఏడు నెలలు కావస్తున్న ఇంకా నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి,బిల్లును వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పై చర్యలు తీసుకోవాలని సాధన సమితి నాయకులు బందెల అశోక్ డిమాండ్ చేశారు.42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ జస్టిస్ ఈశ్వరయ్య,డాక్టర్ విశారదన్ మహారాజ్,బాలగోని బాలరాజ్ గౌడ్ పిలుపుమేరకు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోషబోయిన మల్లేష్ యాదవ్,నల్ల నరేందర్,మహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని వెంటనే బీసీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీపై యుద్ధం చేసి రాబోయే పార్లమెంట్ సీతాకాల సీత సమావేశాల్లో 42% రిజర్వేషన్స్42% రిజర్వేషన్స్ ఉప వర్గీకరణ చేయాలని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9,200 కోట్లల్లో కేవలం 2,068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలియజేశారు.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి హార్దిక అభివృద్ధి కోసం మొత్తం 40వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాలని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బిజెపి పై యుద్ధం చేసి పార్లమెంట్లో చట్టం చేసి నంది పార్లమెంట్లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని తెలియజేశారు.సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ హక్కులను బీసీ ఎస్సీ ఎస్టీ లందరికీ అన్ని అవకాశాల్లో రాజ్యాంగబద్ధంగా జనాభా తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టులు కమిషన్లు,బోర్డులు సలహా మండలి లో 90% గా ఉన్నటువంటి ప్రజలకు మాకు కచ్చితంగా సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలని మండల ఎమ్మార్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడి మల్లేష్, అనంత చారి, మాజీ సర్పంచ్ సుదర్శన్, జీనుక గోవర్ధన్,సైదులు, శివరాత్రి సాంబయ్య, భగవంత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *