సాక్షి డిజిటల్ న్యూస్/నవంబర్ 04(తల్లాడ ) ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సామినేని రామారావు శుక్రవారం ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా ఇంట్లోకి చొరబడిన దుండుగులు ఆయనపై దాడి చేసి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ సందర్భంగా సోమవారం నాడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలిసి వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదు అని స్పష్టం చేశారు. రామారావు కుటుంబానికి అండగా నిలబడతామని, కేసును త్వరగా ఛేదించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.
