సాక్షి డిజిటల్ న్యూస్ 4 నవంబర్ 2025 నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం రిపోర్టర్ రాంబాబు,కోవెల కుంట్ల తహసిల్దార్ కార్యాలయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ కలిసి మోంత తుఫాన్ లో జరిగిన నష్టం గురించి తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు నవీన్ మాదిగ దండు రామ సుబ్బయ్య రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ బందెల ఓబులేసు వీరి ఆధ్వర్యంలో మౌంత తుఫాన్ అధిక వర్షపాతం వల్ల మట్టి మిద్దెలు కూలిపోయాయి మరికొన్ని ఎక్కువగా దెబ్బతిన్నాయి వీరికి ప్రభుత్వం తరఫున నూతన గృహాలు నిర్మించి మరియు కోవెలకుంట మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావున ఏ దిగువ ఉన్న పొలాలు మొత్తం నీటిలో మునిపోవటమే కాకుండా దినసరికి వ్యవసాయ కూలీలు పనులు లేక ఆర్థికంగా కుటుంబం నడవక అటు వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు చాలా నష్టపోయారు ఇంటింటికి నిత్యావసర వస్తువులు మరియు ఆర్థికంగా ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం చెల్లించాలని ప్రజలను ఆదుకోవాలని మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు నిలువగొండ్ల నవీన్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు దండు రామసుబ్బయ్య ముఖ్యఅతిథిగా రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందెల ఓబులేష్ పట్టణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పరదేశి రమేష్ ఠాగూర్ కొమ్ము సుబ్బరాయుడు రాజు జడల వెంకటన్న మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.