సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు క్రీడల్లో రాణించాలని నేషనల్ కరాటే ఛాంపియన్ డాక్టర్ అనిల్ రెడ్డి సూచించారు. హయత్ నగర్ పరిధిలోని సాయి నగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో సోమవారం క్రీడా సమావేశ ప్రారంభోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సతీష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్ ఆర్ ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయన్నారు. శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ అంజనీదేవి, జోనల్ పిఈటి అయోధ్య మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆటలు విద్యార్థుల్లో క్రమశిక్షణను నేర్పిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ కోఆర్డినేటర్ రఘు వంశీ, డీన్ రఘుపతి, సి బ్యాచ్ ఇన్ చార్జి సోమయ్య, ప్రైమరీ ఇన్ చార్జి స్వరూప రాణి, ప్రీ ప్రైమరీ ఇన్ చార్జి మాధవి, ఏవో ప్రమోద్, విద్యార్థులు పాల్గొన్నారు.