వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 03, మల్లాపూర్ మండలం రిపోర్టర్,ఆకుతోట నర్సయ్య: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు సిరిపూర్, కొత్త దామరాజ్ పల్లి, పాత దామరాజ్ పల్లి, మొగిలిపేట నడికుడ గ్రామాలలో పాక్స్ ఆద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుష్పలత నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణరావు తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని అన్నారు. ఇట్టి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి,పాక్స్ సీఈవో భూమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దం రాధ సుధాకర్ రెడ్డి ,పాక్స్ డైరెక్టర్ నారాయణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం నర్సారెడ్డి, నిగ రవి,ఏలేటి లింగారెడ్డి, ఉత్కం హన్మంతు, రోండ్ల రాజ రెడ్డి, పతకాల కిరణ్,సురేష్,ఎల్లా రెడ్డి,నత్తి రామ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *