సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 03 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూర్ నుండి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ జూడో పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థిని.ఈనెల ఒకటి రెండు తేదీలలో వరంగల్ జిల్లా హనుమకొండలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ జూడో పోటీలు నిర్వహించడం జరిగినది ఈ పోటీలకు మోత్కూరు కు చెందిన మహేశ్వరం విమల శ్రీ 36 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిందని సీనియర్ జూడో కోచ్ అన్నేపు వెంకట్ తెలిపారు గెలుపొందిన విద్యార్థిని జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ కే దశరథ్ రెడ్డి జిల్లాజూడో ఫౌండర్ పి బాలరాజ్ మోత్కూర్ మండల ఎంఈఓ టి గోపాల్ రెడ్డి తదితరులు అభినందించారు ఈ కార్యక్రమంలో కరాటే ఇన్స్పెక్టర్ కనుక రాజు పాల్గొన్నారు