సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 3, నవాబుపేట్ మండలం: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతులైన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఇక ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.