మోత్కూరులో ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 3 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూర్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి ప్రైవేట్ కళాశాలల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. దాంతో మోత్కూర్ పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాలలు గేట్లకు తాళాలు వేసి మూసేశారు. ఉదయం కళాశాలలకు వచ్చిన విద్యార్థులు గేట్ల వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. TPDMA యాజమాన్యం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ బంద్ కొనసాగుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. క్లాసులు నిర్వహించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థులు తెలిపారు.ఈ నిరవధిక బంద్ కొనసాగితే రాబోయే పరీక్షల షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక విద్యార్థులు, కళాశాల యజమానులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధ్యాపకులు మండిపడ్డారు. ఎం.జీ.యూ. జనరల్ సెక్రటరీ సి.హెచ్. సత్యం గౌడ్ మాట్లాడుతూ, డబ్బులు విడుదల చేయకపోతే కళాశాలలను కొనసాగించడం అసాధ్యం అవుతోందని, ప్రభుత్వం నుంచి 1200 కోట్ల రూపాయల బకాయిలు రావలసి ఉందని, కేవలం 300 కోట్లే విడుదల చేసి, మిగతా 900 కోట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *