సాక్షి డిజిటల్ న్యూస్: కారేపల్లి, నవంబర్ 4, మాదారం గోవిందతండా గ్రామానికి చెందిన యువతి విఘ్నేశ్వరి దురదృష్టవశాత్తూ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాదారం మాజీ సర్పంచ్ నరేష్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన ఉదయం 9 గంటలకే విఘ్నేశ్వరిని ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు వెంటనే బ్రెయిన్ సర్జరీ అవసరం ఉందని సూచించగా, మాజీ సర్పంచ్ నరేష్ కుమార్ గారి కృషితో, తెలంగాణ ప్రభుత్వ మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సాయంతో ఖమ్మం ప్రసిద్ధ న్యూరో సర్జన్ డాక్టర్ పెద్దిరెడ్డి బృందం అత్యవసర చికిత్స నిర్వహించింది. సుమారు 5 గంటలపాటు కొనసాగిన కీలకమైన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ క్లిష్ట సమయంలో ఉదయం నుండి ఆస్పత్రిలోనే ఉండి అన్ని ఏర్పాట్లు చేపట్టిన మాజీ సర్పంచ్ నరేష్ కుమార్ గారి సేవాభావాన్ని విఘ్నేశ్వరి తల్లిదండ్రులు, గ్రామస్థులు, సన్నిహితులు అభినందించారు. కుటుంబం చేసిన పిలుపు తరుణంలో స్పందించి ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషించిన నరేష్ కుమార్ గారి వైపు ప్రశంసల వర్షం కురుస్తోంది. గ్రామ ప్రజలు విఘ్నేశ్వరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.