మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి పది రోజులు జైలు శిక్ష విధించిన స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ II క్లాస్

సాక్షి డిజిటల్ నవోంబర్ 04 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : గొల్లపల్లి మండల ఎస్సై M. కృష్ణ సాగర్ రెడ్డి వాహనాలు తనిఖీలు చేపట్టగా ఓల్లెపు సమ్మయ్య s/o కనుకయ్య, 39 సంవత్సరాలు , r/o జగదేవ్ పేట గ్రామం, వెలగటూర్ మండలం అను నతడు మద్యం సేవించి తన టు వీలర్ పై రాగా అతన్ని తనిఖీ చేయగా 550 BAC వచ్చినది. ఇతన్ని జగిత్యాల కోర్ట్ నందు ప్రవేశపెట్టగా స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ II క్లాస్ జగిత్యాల్ 10 రోజుల జైలు శిక్ష విధించినారు. ఈ సందర్భంగా గొల్లపల్లి ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిందిగా తెలియజేసినారు.