సాక్షి డిజిటల్ నవోంబర్ 04 ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి అజయ్ : ఈరోజు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ IPS ఆదేశాల మేరకు ధర్మపురి మండలంలోని మగ్గిడి మోడల్ స్కూల్ లో ఉదయ్ కుమార్ SI ఆధ్వర్యంలో పోలీసు చట్టాలు, షీ టీం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, గాంజా నిర్మూలన, రోడ్డు ప్రమాదాల పైన అవగాహన, విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, డయల్ 100, అనేక పోలీసు చట్టాల పైన పోలీస్ కళాబృందం చేత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పోలీసు కళాబృందం అనేక చట్టాల పైన పాటలు పాడడం జరిగింది మరియు ఈ సందర్భంగా ధర్మపురి SI ఉదయకుమార్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి బావి భారత పౌరులని, సైబర్ నేరాల పట్ల మోసపోవద్దని చైతన్యంతో మెలగాలని, గొప్ప చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలు ఎదగాలని విద్యార్థులకు చైతన్యపరిచినారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ , అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు , పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.