సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :4 ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం: ప్రతి గ్రామంలో సిపిఐ వందేళ్ల ఉత్సావాలు ఘనంగా నిర్వహించి నవభారత నిర్మాణంలో సిపిఐ నిర్వహించిన పాత్ర ప్రజాసంక్షేమంకోసం చేసిన సుదీర్ఘపోరాటాల చరిత్రను వివరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ పెనగడప గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామాసెంటర్లలో జరిగిన సమావేశాల్లో సాబీర్ పాషా ప్రజలను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్రానికి పూర్వమే కాన్పూర్లో ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ దేశ స్వతంత్రం కోసం అలుపెరగని పోరాటాలు చేసిందని స్వతంత్రం అనంతరం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు హక్కులపై పోరాడిందని పాలకులకు పలుసూచనలు చేసిందన్నారు. అధికారంకోసం కాకుండా ప్రజలకోసం పనిచేసి పార్టీ ఒక్క కమ్యూనిస్టు పార్టీనేనని ప్రజలకు నాటి నుంచి నేటివరకు అందిస్తున్న ఫలితంగానే భారతీయ రాజకీయ చరిత్రలో సుదీర్ఘంగా మనగలిగిన పార్టీగా సిపిఐ ఉందన్నారు. ఈ ఏడాది 26న వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఖమ్మం నగరంలో జాతీయ స్థాయి ముగింపు బహిరంగ సభ ఉత్సావాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి లక్షమందిని తరలించే లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సావాల జయప్రదానికి అన్నివర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు జి వీరాస్వామి మండల నాయకులు నీడలా సుధాకర్ వెంకన్న పుల్లయ్య కట్టా ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.