భూక్య భీమాసేవలు మరువలేనివి

★బిఆర్ఎస్ పార్టీ కామేపల్లి మండల మాజీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య

సాక్షి డిజిటల్ న్యూస్, కామేపల్లి (నవంబర్ 3) : భూక్య బీమా సేవలు మరువలేనివని,ఆయన మృతి తీరని లోటని కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య అన్నారు. సోమవారం కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో నిర్వహించిన భీమా దశదిన కార్యక్రమంలో ఆయన పాల్గొని భీమా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. మంచి మనిషికి నిలువెత్తు రూపం భీమా అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించి అందరికీ ఆదర్శంగా భీమా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతగా, గోవింద్రాల
బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి పార్టీ అభివృద్ధికి మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు భీమా అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంతాపమును,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నేతలు మల్లెంపాటి శ్రీనివాసరావు,సామ మోహన్ రెడ్డి, వడియాల కృష్ణారెడ్డి,తీర్థాల చిదంబరావు, భట్టు శంకర్ నాయక్,మూడ్ కృష్ణ ప్రసాద్, అజ్మీర రాజు, జరుపల భగవాన్, శ్రీను,రాము, లకావత్ భీమా,రాయల వెంకన్న, జల్లి రాములు, కన్నమాల రాంబాబు, ముచ్చర్ల మాజీ సర్పంచ్ జాటోత్ జాయ్ లూసీ, గోవింద్రాల మాజీ సర్పంచ్ రవి, అజ్మీర కుమార్, మంచాల వెంకన్న, జరపల మోతిలాల్, లకావత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.