ఫీజు రీయింబర్ మెంట్ చెల్లించాలి. పేద విద్యార్థుల చదువులను కాపాడాలి.

*ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని కి వినతి పత్రం అందచేత.

సాక్షి డిజిటల్ న్యూస్ కొత్తగూడెం కాన్స్టెన్సీ ప్రతినిధి పనిత మార్కు నవంబర్ 4 కొత్తగూడెం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజికవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసిన ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ గత నాలుగేళ్లగా పెండింగ్ లో ఉన్న 8500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చూపించ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కూనంనేనినీ కోరినట్లు తలిపారు. ఎంతోమంది పేద విద్యార్థులు ప్లీజ్ రియల్ మెంట్ ప్రభుత్వ సహాయంతో చదువుకుంటున్న విద్యార్థులకు కాలేజీలల్లో ఇప్పటివరకు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరం అని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులను కాలేజీ యజమాన్యాలు ఫీజుల పట్ల ఒత్తిడి తీసుకురావడం సర్టిఫికెట్స్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కనీసం విద్యార్థుల సమస్యలపై స్పందించే అవకాశం లేదని, మా ఫీజులు మాకు చెల్లించండి అని విద్యార్థులు రోడ్లు ఎక్కుతుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించటం దుర్మార్గపు చర్య అని అజిత్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఏఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదని, తక్షణమే స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ నాయకులు ఉమ మహేశ్వరరావు కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *