సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 4 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా). ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ “హర్షవర్ధన్ రాజు” నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.అందిన ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్,భూవివాదాలు,ఆర్థిక తగాదాలు, అత్తారింటి వేదింపులు,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు, చీటింగ్ మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు వన్ టౌన్ సీఐ వై.నాగరాజు, దర్శి సీఐ వై.రామారావు, మార్కాపురం సీఐ పి.సుబ్బారావు, కొండేపి సీఐ జి.సోమశేఖర్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.