సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 4 రిపోర్టర్:షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ 500/82 వారి ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సమస్యల గురించి.ఈరోజు కలెక్టర్ గారి ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమం లో మన సమస్యలు వినత పత్రం ఇవ్వడానికి వెళ్లడం జరిగింది. అనివార్య కారణాలవల్ల కార్యక్రమం రద్దు జరిగింది.అనంతరం మన నాయి బ్రాహ్మణ సమస్యలు వినత పత్రం కౌంటర్లు లో ఇవ్వడం జరిగింది.అనంతరం రిసిప్ట్ తీసుకోవడం జరిగింది.ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెనకబడిన తరగతుల జిల్లా ఆఫీసర్ విజయలక్ష్మి గారిని కలిసి వారికి మన సమస్యల వినత పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ,డి, విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వం కలిసి వారిని శాలువ సత్కరించడం శుభాకాంక్షలు తెలపడంజరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా 500/82 అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు దడిగల మల్లేష్, అరసవిల్లి వెంకటేశ్వరరావు, ఉప్పనపల్లి కాశయ్య, కడియాల శ్రీనివాస్ రావు, మాడుగుల ముకేశ్ రావు, జనగామ వంశీ,తదితరులు కార్యక్రమం హాజరైనారు మన యొక్క సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు,పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే చెల్లించాలని 250 యూనిట్ల ఉచిత విద్యుత్ మా యొక్క షాపులకు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అట్లాగే నాయి బ్రాహ్మణ ల వృత్తిదారులు అభివృద్ధి కొరకు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు అందించాలని కోరడం జరిగింది.అట్లాగే ఈ మధ్యకాలంలో రాజువ యువశక్తి రుణాలు దరఖాస్తు చేసుకున్న వాళ్లు స్టీల్ డెవలప్మెంట్ కొరకు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే పదో తరగతి చదివి ఉండాలి ఆ పైన ఎంతైనా చదవచ్చు మరియు 20 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు లోపు వాళ్లు ట్రైనింగ్ కి వెళ్ళవచ్చని ఈరోజు మనకి ఈ డి విజయలక్ష్మి తెలియజేయడం జరిగింది. ఎవరైనా ట్రైనింగ్ కి వెళ్ళాలి అని అనుకునేటోళ్లు ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయగలరు 9441688476 మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.