సాక్షి డిజిటల్ న్యూస్ /నవంబర్ 04(తల్లాడ ), రిటైర్డ్ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 7న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు జిల్లా కార్యదర్శి తాళ్లూరి వేణు ఆర్గనైజింగ్ కార్యదర్శి దగ్గుల రఘుపతి రెడ్డి పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తల్లాడ లోని పెన్షనర్స్ భవన్లో గోడ పత్రికను ఆవిష్కరించి వారు మాట్లాడారు. 2024 మార్చి నెల నుండి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంతో గత 19 నెలలుగా పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని కొంతమంది అనారోగ్యంతో మరణిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పెన్షనర్లు నవంబర్ 7న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిరసన ధర్నా లో తల్లాడ ప్రాంతానికి చెందిన పెన్షనర్లు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల జిపిఎఫ్ గ్రాచుటీ కమ్యూటేషన్ సరెండర్ లీవ్ తదితర ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 700 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తాం అన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన నిలుపుకొని పెన్షనర్లను ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడాలని లేనియెడల మరింతమంది తనువు చాలించే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఆరోగ్య కార్డులు అన్ని ఆసుపత్రులలో అమలు కావక పోవడంతో పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తల్లాడ అధ్యక్షులు కొంచెం రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు ప్రధాన కార్యదర్శి మండే పూడి లక్ష్మయ్య ఆర్థిక కార్యదర్శి బి రెడ్డి తిరుపతిరెడ్డి ఉపాధ్యక్షులు హిందూ బ్రహ్మయ్య మళ్ళీ కోటేశ్వరరావు జిల్లా కౌన్సిలర్ దిరిశాల వెంకటరామయ్య, నాయకులు టి వెంకటేశ్వర్లు మిట్టపల్లి కృష్ణారావు, పటాన్ మదర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
