సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 3 పెనగలూరు రిపోర్టర్ మధు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం మండలంలోని పాత సింగనమల గ్రామంలో గల వామన మూర్తి స్వామి దేవాలయం సంబంధించిన సర్వేనెంబర్ 458లో 1,39 ఎకరాల మన్యం భూమి ఇదే గ్రామానికి చెందిన చింతకాయల జయరామయ్య పేరుతో ఆన్లైన్ జరిగినట్లు పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో ఉందని పెనగలూరు మండల మాజీ జడ్పిటిసి ఎర్రి నరసింహులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక వీఆర్వోను ప్రశ్నించగా తనకేమీ తెలియదని రెవెన్యూ కార్యాలయ రికార్డుల్లో ఉన్న సమాచారమే ఇక్కడ పొందు పరుస్తామని తెలిపినట్లు ఆయన తెలిపారు. ఈ సమాచారాన్ని దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఆయన తన వెబ్సైట్లో పరిశీలించి ఆ భూమి వామనుమూర్తి స్వామి దేవాలయానికి సంబంధించిన మాన్యం భూమి అని తెలిపారున్నారు. ఈమాన్యం భూమిని చింతకాయల జయరామయ్య పేరుతో ఆన్లైన్ తొలగించాలని వెనకలూరు ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఎటువంటి చర్య చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై పెనగలూరు తాసిల్దారు డి అమరేశ్వరుని వివరణ కోరగా ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో పెనగలూరు మండలంలో భూ కబ్జాల పర్వం మితిమీరిపోతున్నందువల్ల ఈ దేవుని మాన్యం భూమిని కూడా రెవెన్యూ అధికారులు అలాగే తారుమారు చేస్తారేమోనని మాజీ జెడ్పిటిసి ఆవేదన వ్యక్తం చేశారు.