సాక్షి డిజిటల్: నవంబర్ 4, అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఒక వ్యక్తి కారుణ్య నియామకం అని అబద్ధం చెబుతూ, తన వాహనంపై”రెవెన్యూ డెఫ్ట్”అని స్టిక్కర్ వేయించుకొని, మండల ప్రజలను మరియు అధికారులను నమ్మించుకుంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుగా జరుగుతున్న ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఈ వ్యక్తి ఇప్పటికే గతంలో పలు పత్రికలలో వార్త కథనాలు వచ్చినప్పటికీ, తన ప్రవర్తనలో మార్పు లేకుండా, అదేవిధంగా కార్యాలయంలో తిరుగుతూనే ఉన్నాడు, సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, స్థానికుల్లో ఆగ్రహానికి దారితీసింది. స్థానిక ప్రజల ప్రకారం, ఈ వ్యక్తి తహసిల్దార్ కార్యాలయంలో ఒక ముఖ్య అధికారిలా వ్యవహరిస్తూ, ప్రజల పనుల్లో, జోక్యం చేసుకుంటున్నాడని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అవమాన పరుస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, సంబంధిత వ్యక్తి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల అభిప్రాయ ప్రకారం, వార్తాపత్రికల ద్వారా ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని,విమర్శలు వినిపిస్తున్నాయి, తక్షణమే చర్యలు తీసుకొనకపోతే, దమ్మపేట తహసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని. స్థానికులు తెలియజేసినప్పుడు స్పందించకపోతే అవసరమైతే రాస్తారోకోలు కూడా చేపట్టాల్సి వస్తుంది” అని స్థానిక ప్రజలు గట్టిగా హెచ్చరిస్తున్నారు.