సాక్షిడిజిటల్ న్యూస్, నవంబర్ 04,రాయికల్, వై.కిరణ్ బాబు:-ఆహార ధాన్యాల అమ్మకంలో నిబంధనలతో కూడిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తూకం చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో మక్కల,వరి కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి సోమవారం పరిశీలించారు. రైతులు పలు సమస్యలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎకరా 18 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు నిబంధనలతో రైతులు నష్టపోతున్నారని ఎకరా 30 క్వింటాళ్లు దాన్యం కొనుగోలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశానని అన్నారు. ప్రభుత్వం పరిశీలించి 18 క్వింటాళ్ల నిబంధనను సడలించి ఎకరా 25 క్వింటాళ్లు కొనుగోలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఊరట లభించిందన్నారు. ధాన్యం అమ్మేందుకు రైతులకు వేలు ముద్ర నిబంధనలతో కౌలు, వలస రైతులు ఇబ్బందులు పడతారని పాసుపుస్తకం, వ్యవసాయ శాఖ అధికారులు పంట సాగును పరిగణలోకి తీసుకొని ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు.అకాల వర్షానికి నేలకొరిగిన,ధాన్యం తడిసిన స్థానిక కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్ట వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తే ఎకరా 10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తుందన్నారు. కొనుగోలు ప్రారంభమైనప్పటికీ తూకంలో జాప్యం జరుగుతుందని అధికారులు స్పందించి తక్షణమే తూకం చేపట్టాలన్నారు. మొక్కజొన్న కొనుగోలులో ఆహార ధాన్యాల్లో సగటు నాణ్యత ప్రమాణాలు మొక్కజొన్న 14 శాతం మ్యాచర్, 6శాతం ఫారెన్ మ్యాటర్ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేంధర్ గౌడ్,నాయకులు కొయ్యేడి మహిపాల్, దాసరి గంగాధర్,తలారి రాజేష్,బత్తిని భూమయ్య, షాకీర్, బత్తిని నాగరాజు, జలంధర్ ,రమేష్, మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.