డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 3 పెనగలూరు రిపోర్టర్ మధు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం మండల కేంద్రంలోని పెనగలూరు ఎగువ హరిజనవాడ , ముస్లిం కాలనీలలో నిల్వ ఉన్న వాన నీటి వల్ల ఎగువ కొత్తపల్లిలోని ముస్లిం వీధి బస్టాండ్ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి ఊటనీరు సిమెంట్ రోడ్లపై పంట కాలువ తరహాలో నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల సిమెంట్ రోడ్లు పైపాచిపట్టడంతో ఆ వీధులలో నిత్యం సంచరిం చేప్రజానీకం జారీ పడిపోతున్నారు. దీనివల్ల కొందరికి స్వల్ప గాయాలతో బయటపడుతుండగా మరికొందరు తీవ్ర గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వీధులలో సిమెంట్ రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువల నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా వర్షపు నీరు రెండు కాలనీలలో ఇంకో నెల రోజులపాటు అలాగే వాన నీరునిల్వ ఉంటుందిఅందువల్ల ఈ రోడ్లపై ఇప్పుడల్లా ఊట నీరు ప్రవాహం ఆగిపోదు. మరో నెల రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే రోడ్డుపై పూర్తిగా పాచిపెట్టి పాదచారులు నడవలేనంతగా తయారవుతాయని స్థానికులు అంటున్నారు. ఈ వీధిలో నీదుస్థితిపై అధికారులు దృష్టి సారించి వెంటనే డ్రైనేజీ కాలువల నిర్మాణానికి సన్నాహాలు చేయాలని స్థానికులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *