సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 3 మణుగూరు /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: కాంగ్రెస్ కార్యాలయం అయితే అడిగితే ఆధారాలు చూపించి ఎవరిది అయితే వాళ్ళు తీసుకునే వాళ్లు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తాను ఆ స్థలం పట్టా దారు దగ్గర నుంచి కొనుగోలు చేశాం. ఎవరి స్థలం ఇంకెవరో దానం చేసానని చెబితే ఎలా కుదురుతుంది. 2010 లో రూ. 2 లక్షలకు స్తలం కొనుగోలు చేశాం. 2023 లో చందా హరిక్రిష్ణ నుంచి కొనుగోలు చేయడానికి ఆ నాడు చందా హరిక్రిష్ణ ఎక్కడున్నాడు. ప్రజలకు తెలియదా. చేతగాకే భౌతిక దాడులకు పాల్పడ్డారు. గుండ్ల సింగారం ఇసుక రీచ్ ను ఆశగా చూపి చందా హరిక్రిష్ణ నుంచి కాగితాలు రాపించుకుని ఉండొచ్చు. కానీ కార్యాలయం మాది అంటే ఆధారాలు చూపి మీదే అయితే ఇచ్చేవాళ్ళం కదా. దాడులకు పాల్పడటం తీవ్రంగా కండిస్తున్నాం. డీమఫ్ట్ నిధులు పాలేరు, మధిర కి తరలివేస్తుంటే ప్రశ్నించిన అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని చట్ట పరంగా ముందుకు వెళ్లి పోరాడి తెచ్చుకుంటాం.మాజీ ఎమ్మెల్యే బి ఆర్ యస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు.