డిసెంబర్‌లోపు డంపింగ్ యార్డు క్లియర్ – జనవరి నుంచి గ్రీనరీ పనులు ప్రారంభం!

సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 3, చిత్తూరు పట్టణం (రిపోర్టర్, జయచంద్ర): డంపింగ్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాలను డిసెంబర్ లోపల పూర్తిగా తొలగించాలని, జనవరి నుంచి గ్రీనరీ పనులు ప్రారంభించాలని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభిరామ్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తో కలిసి సంతపేటలోని మున్సిపల్ డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. బయో మైనింగ్ పనుల పురోగతిని పరిశీలించిన పట్టాభిరామ్, రికార్డులను స్వయంగా కంప్యూటర్ లో తనిఖీ చేశారు. బయో మైనింగ్ కోసం రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నామని, అయితే పనులు ఊహించిన వేగంతో సాగడం లేదని అధికారులు దృష్టికి తెచ్చారు. “కంటికి కనిపించేలా మార్పు ఉండాలి. ప్రతి రోజు పనుల వివరాలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సాఫ్ట్వేర్ లో నమోదు కావాలి” అని ఆయన హెచ్చరించారు. 24 గంటల్లో ఇంటిగ్రేషన్ ఆదేశం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సాఫ్ట్వేర్ తో బయో మైనింగ్ కంపెనీ డేటా 24 గంటల్లో ఇంటిగ్రేట్ కావాలని, రోజువారీ పనుల వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన వ్యర్థాలను పకడ్బందీగా డిస్పోజ్ చేయాలని, ఎటువంటి వ్యర్థాలు మళ్లీ పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిత్తూరులో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, “చిత్తూరు నగరానికి ప్రత్యేకంగా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ మంజూరు చేస్తాం. అవసరమైన స్థలాన్ని వెంటనే కేటాయించాలి” అన్నారు. బయో మైనింగ్ పనులపై ప్రతి వారం డ్రోన్ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. జనవరి నుంచి పచ్చదనం కార్యక్రమం
“డంపింగ్ యార్డును పూర్తిగా శుభ్రపరచి, వచ్చే వేసవికల్లా పచ్చదనంతో నింపుతాం. జనవరి నుంచి ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా గ్రీనరీ పనులు ప్రారంభిస్తాం” అని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మేయర్ ఎస్. అముద, కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్వో డా. లోకేష్, పబ్లిక్ హెల్త్ డీఈ పుష్పగిరి నాయక్, తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *