జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: NHRC జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్

సాక్షి డిజిటల్ న్యూస్ : నవంబర్ 04కొమురం భీమ్ రెబ్బనా :రిపోర్ట్ (బొగ్గుల రాజ్ కుమార్ ) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 10,000/ వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని ప్రకటించింది.వ్యవసాయ అధికారులతో పంట నష్ట నివారణ సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 4722 మంది రైతులుఉన్నట్టు గుర్తించింది. సర్వే నిర్వహించి నేటికీ 3 నెలలు గడుస్తున్నా రైతులకు నష్టపరిహారం నిధులు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. దీనికి తోడు ప్రస్తుతం మెంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు రైతులకు చేతికి అందిన పంట వర్షాలకు తడిసి నాశనం అయ్యింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైతులు ప్రవేట్ వ్యాపారస్తులకు పంటను అమ్ముతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. తడిసిన పంటను తేమ శాతం చూడకుండా ప్రభుత్వం పత్తికి 10,000 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మరియు రైతులకు నష్టపరిహారం నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవరం నాడు జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కలిసి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *