సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; భద్రాచల పట్టణంలో అక్రమంగా నిర్మించుకుంటున్న బహుళ అంతస్తుల బిల్డింగులు గ్రామపంచాయతీ స్థలాలు ఆక్రమణ చేసి రహదారులు నిర్మించుకుంటున్న ఫుట్ పాత్ ల ఆక్రమణ కనిపించడం లేదని ఆటో జేఏసీ అధ్యక్షులు ఆదివాసి నాయకులు మర్మం శంకర్ అన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా పంచాయతీ అధికారి అనూష ని కలిసి భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో అండతో అక్రమ నిర్మాణాలు, ఫుట్ పాత్ ల ఆక్రమణ పెరిగిపోతున్నాయని వినతి పత్రం అందించడం జరిగిందని మర్మం శంకర్ అన్నారు. భద్రాచలం గ్రామపంచాయతీ ప్రజా సమాచార హక్కును అవమానం పరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, తన గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తు బిల్లింగ్ తనకు కనిపించలేదని ఎద్దేవా చేశారు. అసలు భద్రాచలంలో బహుళ అంతస్తులు లేవని, ఎక్కడ ఫుట్ పాత్ ఆక్రమించుకోలేదని అద్దెలకు ఇచ్చుకున్న అమ్ముకున్న వారికి సపోర్టుగా గ్రామపంచాయతీ ఈఓ నే ఉండడం బాధాకరమని అన్నారు. భద్రాచలంలో నాలుగు అంతస్తులు భవనం ఎక్కడ నిర్మించలేదని తప్పుడు సమాచారం ఇస్తున్నారు భద్రాచలంలో 70 నుంచి 90 మధ్యలో అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ వీటి పైన చర్యలు తీసుకోకపోవడం గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు భద్రాచలం గ్రామపంచాయతీ ఈ ఓ కు తన కులానికి చెందిన మంత్రులు అండగా ఉండడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధన లను పాతరేస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ ఈ ఓ దీనికి బాధ్యులైన అధికారులపై ఎంక్వయిరీ చేసి ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసి సంఘాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు