సాక్షి డిజిటల్ న్యూస్ : 3 నవంబర్ 2025 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు (రాము) సోమవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం పై రూపొందించబడిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుండి 30 వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంగవైకల్య నివారణకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కుష్టు వ్యాధిపై ప్రజల్లో అవగా అపోహలు తొలగించి వారికి క్రమం తప్పకుండా చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలను గుర్తించి వైద్య సేవలు అందిస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని జిల్లాలోని ప్రతి ఒక్కరికి క్రుణంగా కృషి వ్యాధి పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ డిఎంహెచ్ఓ లక్ష్మీ నరసయ్య, జిల్లా టిబి అధికారి రాధిక, మెడికల్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.