సాక్షి డిజిటల్ న్యూస్ (నవంబర్/04), ఫరూక్ నగర్ రిపోర్టర్: కృష్ణ,చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు బస్సు రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధాకరమని గౌరవ ఉమ్మడి మహబూబ్ నగర్ మ్మెల్సీ నగర్ కుంట నవీనరెడ్డి గారు పేర్కొన్నారు బస్సు ప్రయాణికులపై టిప్పర్ లో ఉన్న కంకర పడిపోవడంతో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన తీవ్ర విషాద ఘటన కలిచివేసిందని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.