సాక్షిడిజిటల్ న్యూస్ గంగారం(కొండూరిప్రకాష్):-గంగారం నుండి కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు,నిత్యం ప్రమాదాలకు,ట్రాఫిక్ అంతరాయాలకు కారణమవుతుండటంతో ఈ భయంకరమైన పరిస్థితిని గమనించిన గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మరియు వారి బృందం, ముడిగ విజయ్, గుండగాని శ్రీధర్, మరియు తదితరులు కలసి రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగారు.ఎటువంటి అధికారిక సాయం కోసం వేచి చూడకుండా,కేవలం మానవతా దృక్పథంతో భారీ గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ తాత్కాలిక మరమ్మత్తుల వల్ల వాహన దారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా ప్రయాణించే వీలు కలిగింది.తమ ఇబ్బందులను గుర్తించి, తక్షణమే స్పందించిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలు మరియు వాహనదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.