కోటలో మహిళా బ్యాంక్ స్వర్గధామాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

★గిరిజనులకు చాపల మార్కెట్ ప్రారంభించడం సంతోషం - పాశం సునీల్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 3 కోట మండలం, తిరుపతి జిల్లా: కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన మహిళా బ్యాంకు ను గూడూరు ఎమ్మెల్యే పాసింజర్ సునీల్ ప్రారంభోత్సవం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక నాయకులు, నాటి ఆర్డీవో కిరణ్ కుమార్ అధికారుల సహకారంతో అన్ని హంగులతో మహిళా బ్యాంకును పూర్తి చేశారు. అయితే వైసిపి నాయకుల వర్గ పోరుతో చివరి క్షణంలో మహిళా బ్యాంకు ప్రారంభోత్సవం రద్దయింది. ఎట్టకేలకు అన్ని హంగులు పూర్తి చేసుకున్న మహిళా బ్యాంకును టిడిపి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చొరవతో సోమవారం అట్ట హాసంగా ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా శ్యాంసుందరపురం వద్ద ఉన్న హిందూ స్మశాన వాటిక స్వర్గధామం ప్రభుత్వ నిధులు, దాతలు విరాళాలు సహాయంతో గత వైసిపి ప్రభుత్వం లోనే దాదాపు పూర్తయింది. వివాదాల నడుము నడుస్తున్న స్వర్గధామాన్ని ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. శ్రీ లక్ష్మ గిరిజన కాలనీ గిరిజనుల శ్రేయస్సు కొరకు చాపల మార్కెట్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో కోట మండల టిడిపి అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, కోట మండల టిడిపి మాజీ అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి, టిడిపి నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ చిలుకూరు దశరధి రామిరెడ్డి, తిరుపతి పార్లమెంట్ మైనార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, ఎంపీటీసీ షేక్ సంశుద్ధిన్, ఏఎంసి చైర్మన్ మర్రి ప్రమీల,వెంకన్నపాలెం సర్పంచ్ కాకర్ల మధు యాదవ్, నెల్లూరు మోహన్ రెడ్డి,టిడిపి మహిళా నాయకురాలు సిద్దపరెడ్డి పోలమ్మ, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, వాకా విజయ భాస్కర్ రెడ్డి, పల్లె మల్లు వెంకటకృష్ణారెడ్డి, పిండి వెంకట కృష్ణయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు మురళి, ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్, ఏపీఎం అనిలా, కోట ఎస్సై పవన్ కుమార్, మండల సర్వే గోపీనాథ్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో వేణు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కోట మండల ప్రజలు పాల్గొన్నారు