కొత్తగూడెం మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన ప్రోగ్రాం.

★హాజరైన పాల్వంచ డీఎస్పీ.సతీష్ కుమార్.

సాక్షి డిజిటల్ న్యూస్:3 నవంబర్,పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం కు పాల్వంచ డీఎస్పీ.సతీష్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ,ర్యాగింగ్ అనేది తీవ్రమైన నేరం అని,దీనికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని,క్యాంపస్ లో సురక్షితమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. శ్రీహరి రావు, ఎస్ఐ సుమన్,షి టీం ఎస్ఐ రమాదేవి,అధ్యాపకులు,సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.