సాక్షి డిజిటల్ న్యూస్:4 నవంబర్,పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల జామియా మసీద్ నందు మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గ్యార్వి వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు కొత్తగూడెం నియోజక వర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు,సీపీఐ జిల్లా కార్యదర్శి ఏస్.కె సాబిర్ పాషా,కాంగ్రెస్ నాయకులు రజాక్ పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ,కొత్తగూడెం నియోజక వర్గం మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.గ్యార్వి వేడుక సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ముస్లిం పెద్దలు మాట్లాడుతూ,గ్యార్వి ప్రాముఖ్యతను తెలియజేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు,పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.