కుప్పం అభివృద్ధి నారావారి కుటుంబ లక్ష్యం…..ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్… ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం…

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 3 రాముకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం నారావారి కుటుంబం అహర్నిషులు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నములు పేర్కొన్నారు. శనివారం హానిగానూరు బల్ల వంశి గాని పల్లి విజులాపురం గ్రామాల్లో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం ప్రాంతం ప్రజలకు గతంలో చేసిన అభివృద్ధి కన్నా రెట్టింపు అభివృద్ధి సాగుతున్నట్లు చెప్పారు నియోజకవర్గంలో అందరినీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధి నుండి కాపాడేందుకు నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా మంత్రి లోకేష్ చెరువుతో నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు శ్రమిస్తున్నట్లు చెప్పారు పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రతి కుటుంబం జీవన ప్రమాణం మెరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే గెలుపుకు కృషి చేయాలని కోరారు పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం తప్పక గుర్తించి ఫలితం అందిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునుస్వామి మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి సింగల్ విండో చైర్మన్ మహమ్మద్ రఫీ కుప్పం ఏరియా ఆసుపత్రి కమిటీ మెంబర్ విజయ్ కుమార్ రెడ్డి మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటరమణ నరసింహులు ఎంపీపీ సులోచన గుర్రప్ప వైస్ ఎంపీపీ వెంకటరమణ గౌడు మాజీ సర్పంచులు పివి సీతాపతి రామమూర్తి గంటల గౌడు జేఈ శ్రీనివాసులు రెడ్డిపట్టణారాయణాచారి ఎక్స్ వైస్ ఎంపీపీ చిన్న కృష్ణ రెస్కో డైరెక్టర్ మనోహర్ మాజీ ఎంపీటీసీ నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *