సాక్షి డిజిటల్ న్యూస్ పినపాక ప్రతినిధి నవంబర్ 3 చల్లని కూల్ డ్రింక్ సేద తీరేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు, దీనిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు కాలంచెల్లిన కూల్‌డ్రింక్ బాటిళ్లను అమ్ముతూ సొమ్ము చేసుకుంటు ప్రజల ప్రాణాలతో వారు చెలగాటమాడుతున్నారు, ఆదివారం అశ్వాపురం మండల కేంద్రంలోని ఫేమస్ బేకరీలో స్ప్రైట్ బాటిల్ కొనుగోలు చేసి తాగిన తర్వాత అనుమానం వచ్చి బాటిళ్లపై చూస్తే ఎక్స్‌పైరీ డేట్ (కాలంచెల్లిన) ఉన్నది. స్ప్రైట్ కంపెనీకి చెందిన కూల్‌డ్రింక్ బాటిల్ కొన్న వ్యక్తి దాని డేట్‌ను పరిశీ లించగా అది కాలం చెల్లినదిగా గర్తించాడు, దీంతో దుకాణ దారుడిని ప్రశ్నించగా డీలర్ తెచ్చిఇచ్చిన సరుకును అమ్మడ మేతప్ప మాకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు, కాలం చెల్లించిన కూల్‌డ్రింక్ తాగితే ఆరోగ్య సమ స్యలతోపాటు ప్రాణంమీదికి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు, కూల్ డ్రింక్‌లు, ఇతర తినుబండారాలు కొను గోలు చేసేవారు తప్పని సరిగా తేదీలను చూసుకో వాలని చెప్తున్నారు.