సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 02,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో కేరళ రాష్ట్రంలో నిరూపించి చూపామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు.వెల్లంకి గ్రామంలో ఏర్పాటు చేసిన శాఖ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై జహంగీర్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో సిపిఎం నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం 64వేల పేద కుటుంబాలను గుర్తించి విద్య, వైద్యం మౌళిక సదుపాయాలు అందించి తీవ్ర పేదరికన్ని జయించి దేశంలోనే అగ్రస్థానంలో కేరళ ప్రభుత్వం నిలిచిందని అన్నారు.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా దేశం ముందు సంగర్వంగా ప్రకటించిందని బీజేపీ అధికారం ఉన్న భారతదేశం బంగ్లాదేశ్ కన్నా కింది స్థాయికి వెళ్లిందని ఇదే కమ్యూనిస్టులకు-బీజేపీకి ఉన్న తేడా అని అన్నారు. అందుకే తాత్కాలిక తాయిలాలు కాకుండా శాశ్వతంగా ప్రజలు సర్వతో ముఖాభివృద్ధి చెందడం కోసం కృషి చేస్తుందని అన్నారు.ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలను మోసం చేసి అమలుకాని హామీలిచ్చి ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్న బూర్జవా పాలకులకు ఇది చెంప పెట్టు లాంటిదని అన్నారు.నిత్యం ప్రజల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతీ గ్రామం ఓ కేరళలా అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్,మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నర్సింహా చారి,శాఖ కార్యదర్శి ఆవనగంటి నగేష్, నాయకులు, బర్ల బాబురావు, కర్రే బాలయ్య,పున్న దత్తద్రి,ఆవనగంటి స్వామి, కన్నెబోయిన రాజలింగం, తాటిపాముల నవీన్, అంకేం నాగరాజు, అవనగంటి హరీష్, తాటిపాముల మహేష్, బిక్షం,చెన్ను స్వామి తదితరులు పాల్గొన్నారు.