సాక్షి డిజిటల్ న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా/ బిజినపల్లి మండలం:4 నవంబర్ 2025: (రిపోర్టర్ కొంకలి మధుసూదన్): అధిక వర్షాలతో పేదల ఇండ్లు కూలిపోయాయని నిరాశ్రయులుగా మారారని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో బిజీనాపల్లి ఎమ్మార్వో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అధిక వర్షాలతో అనేక ఇండ్లు కూలి పోయాయని ఉండడానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనేక ఇండ్లు కూలడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని అటువంటి ఇండ్లను అధికారులు సర్వే నిర్వహించి వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు ఇందిరమ్మ ఇండ్ల సహాయాన్ని కూడా ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాలని పెరిగిన ధరలతో ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఎక్కడ కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కేశ చంద్రశేఖర్ మల్లేష్ రాములు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు