సాక్షి డిజిటల్ న్యూస్ 3 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు మండల కేంద్రం పంచాయతీ లో ఇంటి పన్నులు స్వాహా పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకన్న సోమవారం పీజేఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు ఇటీవల బదిలీపై వచ్చిన బిల్ కలెక్టర్ ఇంటి పన్నుల వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారని ఆయనతోపాటు ఇతర సిబ్బంది హస్తము ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది అని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది గతంలో బాత్రూం కుంభకోణంలో పంచాయతీ ఈవో విధులనుంచి తప్పించడం జరిగిందని అన్నారు ఇంటి బిల్లులు స్వాహా పై నిస్వార్ధంగా ని పక్షపాతం దర్యాప్తు జరిగినట్లయితే మరి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు అనంతరం ఎంపీడీవో ఎంవి సువర్ణరాజుకు ఫిర్యాదు అందజేశారు