సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్04, జి.మాడుగుల: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం,అవనీతి నిరోధక విభాగం రాష్ట్రం లో నియమించిన బాధ్యతాయుత పదవుల్లో నేషనల్,రాష్ట్ర కార్యనిర్వహక వర్గం(నేషనల్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ అసోసియేషన్స్ ) అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ గా నియమించినందుకు కిముడు గణపతి(గణేష్)హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నియామకం గౌరవమే కాదు, ఒక గొప్ప బాధ్యతని. నాపై నమ్మకం ఉంచిన సంస్థాధ్యక్షులు, నాయకత్వ బృందానికి, సభ్యులు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు మానవ హక్కుల పరిరక్షణ, సమానత్వం, న్యాయం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి హక్కులు కాపాడబడేలా నిస్వార్థంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మానవతా విలువలను కాపాడుతూ, న్యాయం, శాంతి ఆధారంగా ఉన్న సమాజాన్ని నిర్మిద్దామని ఆయన తెలిపారు. ఈ నియామకం పట్ల గిరిజన సమాజానికి గణేష్ అభినందనలు తెలియజేశారు.