సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 03 రిపోర్టర్, విశాఖపట్నం అక్కయ్యపాలెం, కంచరపాలెం పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు అలసత్వం, బిల్డర్స్ ఇష్టానుసారంగా అనధికార అక్రమ కట్టడాలు నిర్మస్తున్నారు. నిర్మాణాలు ప్రతి ఒక్క భవనం అదనపు అంతస్తుతో ఎటువంటి సెటబాక్స్ లేకుండా నిర్మాణాలను కొనసాగించారు గతంలో ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేశారు, వెంటనే మళ్ళీ యదా విధిగా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు, ఈ నిర్మాణాలపై టిపిఓ ప్రవీణ్ ఏసీపీ తిరుపతిరావు వెంటనే నిర్మాణాలపై చర్యలు చేపట్టి నిర్మాణాలను నిలుపువేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు అలాగే గత కొద్ది కాలంగా జోన్ 5 లో ఏదేచ్ఛగా అనధికార అక్రమ కట్టడాలు జరుగు తున్నాయి వీటిపైన వెంటనే చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ ను స్థానిక ప్రజలు ప్రజా సంఘ స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.