సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 04:రిపోర్టార్ తిరుపతి,: సోమవారం రోజు అనగా తేదీ : 03-11-2025 నాడు సిద్ధిపేట సి.పి కార్యాలయం నందు , శ్రీ. ఎం.స్ విజయ్ కుమార్ , ఐ.పి.స్ పోలీస్ కమిషనర్, సిద్దిపేట తెలిపిన వివరాలు ఏమనగా గత రెండు సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లాలో (16) దొంగతనాలు మరియు రాచకొండ, జగిత్యాల, సూర్యాపేట, యాధద్రి భువనగిరి , వరంగల్, జనగాం, మహబూబాబాద్ జిల్లా పరిధి లో 33 వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠా సభ్యులు (05) మందిని అదుపులోకి తీసుకున్నాము. ఐదుగురు నిందింతలను విచారించగా బత్తుల గురు స్వామి తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు: 31సం.లు, వృత్తి: బైక్ మెకానిక్ , నివాసం: అయ్యనపాలెం గ్రామము చెంద్రుగుండ మండలం జిల్లా:బద్రాద్రి కొత్తగూడెం అనునతడు అతని చిన్నన్న కొడుకు అయిన సాయి రామ్ లు వారు పని చేయగా వచ్చే డబ్బులు కర్చులకి సరిపోవడం లేదనీ, గురు స్వామి బైక్ మెకానిక్ అయినందున గతము లో ఆటో బాటరీ దొంగతనాలు చేయగా కేస్ లు అయినవి అదే అనుభావము తో సెల్ టవర్ లో బ్యాటరీలు దొంగలించితే ఎవరు పట్టించుకోరని వాళ్ళ ఏరియా లో దొంగతన౦ చేస్తే ఎవరైనా గుర్తు పడతారు, తొందరగ దోరికిపోతము అని బయట ప్రాంతాలలో చెయ్యాలి అనుకోని వాళ్ళ గ్రామస్తుడైన బత్తుల శ్రీను అనే వ్యక్తి గత 04 సంవత్సరాల క్రితం నుండి సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండల౦ గురువన్న పేట గ్రామం లో ఇటుక బట్టి నడిపిస్తుంటాడు. అతనికి పని ఎక్కువ వున్నపుడు కూలీలు కావాలి అని గురుస్వామి కి చెప్పినప్పుడు ,అతడు వాళ్ళ గ్రామం నుండి కూలి లను శ్రీను దగ్గరకి తీసుకు వచ్చినపుడు తన ఆటో లో గురువన్నపేట కి చెందిన బండారి శ్రీనివాస్ కిరానా షాప్ లో డీజిల్ పోసుకునేవాడు, అలా శ్రీనివాస్ పరిచయం అయినాడు. మరియు పక్క గ్రామం పోసంపల్లీ కి చెందిన స్క్రాప్ షాప్ బిజినెస్ చేసే పుట్ట ఆంజనేయులు కూడా పరిచయం అయినాడు. తన తమ్ముడు సాయి తో మనం సిద్ధిపేట జిల్లా లో బ్యాటరీ, డీజిల్ దొంగతనం చేస్తే అమ్మడానికి సులువుగా వుంటుందని నాకు పరిచయం ఐన వ్యక్తులు వున్నారు వారికీ అమ్మవచ్చు అని తెలుపగా అతడు సరే అని ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి పగటిపూట రెక్కి నిర్వహించి టవర్ లు ఎక్కడెక్కడ ఉన్నాయో నిర్మానుష్య ప్రాంతాలు ఎంచుకొని రాత్రి సమయములో పలు దొంగతనాలు చేసినారు అలా వాళ్ళు కొన్ని దొంగతనాల తర్వాత పంపకాల విషయములో ఇద్దరికీ గొడవ జరిగి అప్పటి నుండి ఇక్కడ ఇటుక బట్టి నడిపిస్తున్న బత్తుల శీను తన మేనల్లుడు శంకర్ వరసకు బావమరది అయిన లక్ష్మణ్ లకు ఈ దొంగతనాల గురించి చెప్పగా వారు సులువుగా డబ్బు సంపాదించాలని వారంతా ఒప్పుకోగా అందరు కలిసి ఒక ముఠా గా ఏర్పడి ముందుగా గురు స్వామి సాయి రామ్ లు గురు స్వామి అటో లో పలు దొంగతనాలు చేసినారు. దాని వాళ్ళ వచ్చిన డబ్బు తో గురుస్వామి ఒక కార్ కొన్నాడు. తర్వాత కార్ లో వచ్చి దొంగతనాలు చేసినారు. అయితే వీరు దొంగలించిన బ్యాటరీలు మొత్తం పోసాన్పల్లీ కి చెందిన పుట్ట ఆంజనేయులు స్క్రాప్ షాప్ అతనికి అమ్మగా, అతడు నాగపురి కి చెందిన నూనె మహేందర్ కి 4 బాటరీ లు, జోగు మహేష్ కి 4 బాటరీ లు, ఎండ్.హజీమ్ కు 3 బాటరీ లు, శిలసాగరం రామచంద్రం కు 3 బాటరీ లు అమ్మినాడు. దొంగలించిన డీజిల్ మొత్తం గురువన్నపేట కి చెందిన బండారు శ్రీనివాస్ కి అమ్మినారు. జనవరి -2024 నెల నుండి మొన్నటి వరకు గ్రామా శివారులో వున్నా సెల్ టవర్ లను లక్శ్యంగా పెట్టుకుని అందులోని బాటరీలు, డీజిల్ లు వరుస దొంగతనాలకు పాల్పడినమని తమవంతుకు వచ్చిన డబ్బులు, బాటరీలు మేము పంచుకున్నవి పోలీస్ వారు స్వాధీనము చేసుకున్నారని తాము చేసిన నేరాలు అంగీకరించారు. సిద్దిపేట కమీషనర్ విజయ్ కుమార్ ఐ.పి.స్. పర్యవేక్షణలో ఇట్టి దొంగలను పట్టుకోవటానికి నర్సింలు ఏసీపీ గజ్వెల్, తొగుట సీఐ య.కే. లతీఫ్, సీసీస్ సీఐ అంజయ్య, తొగుట ఎస్సై V. రవికాంత్ రావు, రాయపోల్ ఎస్సై మానస, మరియు దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించి వారు సేకరించిన సమాచారము మేరకు తొగుట గ్రామ పరిధిలో గల బతుకమ్మ కుంట వద్ద వాహన తనికీలు చేపట్టి నింధితులను పట్టుకున్నట్లు తెలిపినారు.
,నిందితుల వివరాలు : A-1: బత్తుల గురుస్వామి S/o వెంకటేశ్వర్లు, ఏజ్: 31 ఇయర్స్, Occ: బైక్ మెకానిక్, R/o H. No. 7-117, అయ్యన్నపాలెం విలేజ్ అఫ్ చంద్రుగొండ మండలం అఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా A-2: బత్తుల సాయిరాం S/o పిచ్చయ్య, ఏజ్: 26 , వృత్తి: లారీ డ్రైవర్, R/o H. No. 7-177, అయ్యన్నపాలెం విలేజ్ చంద్రుగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,A-3: అలకుంట లక్ష్మణ్ రావు S/o భద్రయ్య, ఏజ్: 20 , వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, R/ అయ్యన్నపాలెం విలేజ్, చంద్రుగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా. A-4: అలకుంట శంకర్ S/o ముత్తయ్య, ఏజ్: 22 వృత్తి: లారీ డ్రైవర్, R/o అయ్యన్నపాలెం విలేజ్,చంద్రుగొండ మండలం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా A-5: బత్తుల శ్రీను S/o వెంకటేశ్వర్లు, ఏజ్: 36 , వృత్తి: బ్రిక్స్
బిజినెస్, R/o చంద్రుగొండ విలేజ్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాటరీలు మరియు డీజిల్ దొంగ సొత్తు కొన్నవారి వివరాలు A-6: బండారి శ్రీనివాస్ S/o బీరయ్య, ఏజ్: 31 వృత్తి: కిరాణా షాప్, R/o H. No. 1-41, గురువన్నపేట విలేజ్, కొమురవెల్లి మండలం సిద్దిపేట, జిల్లా A-7: పుట్ట ఆంజనేయులు S/o కొండయ్య, ఏజ్: 36 , వృత్తి స్క్రాప్ బిజినెస్, R/o పోసంపల్లి విలేజ్ of కొమురవెల్లి మండలం సిద్దిపేట జిల్లా A-8: శిలాసాగరం రామ్ చంద్రం S/o ఎల్లయ్య, ఏజ్: 25 , వృత్తి: డ్రైవర్, R/o H. No. 1-95, నాగపూరి విలేజ్ కొమురవెల్లి మండలం, సిద్దిపేటజిల్లా A-9: నూనె మహేందర్ S/o రామ్మూర్తి, ఏజ్: 33 , వృత్తి: స్క్రాప్ షాప్, R/o H. No. 6-38, జగదేవపూర్ విలేజ్, మండలం సిద్దిపేట జిల్లా A-10:మొహమ్మద్ హజీమ్ S/o ఎండ్ యూసఫ్, ఏజ్: 40 , వృత్తి: బాటరీ షాప్ బిజినెస్, R/o H. No. 8-100, గజ్వెల్ విలేజ్ మండలం o సిద్దిపేట జిల్లా A-11:జోగు యది @ జోగు మహేష్ S/o గోవిందప్ప, ఏజ్: 40 , వృత్తి: ప్లాస్టిక్ స్క్రాప్ బిజినెస్, R/o అబ్దుల్లాపూర్మేట్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, స్వాధీనపరుచుకున్న సొత్తు మరియు వాహనముల వివరములు 1) 6,65,117/- విలువ గల 28 బాటరీ లు, మరియు 4,899 లీటర్ల డీజిల్ కు గాను 3,01,000/- రూపాయల నగదు, మరియు 18 బ్యాటరీ లు స్వాదీన పర్చుకున్నాము. అలాగే దొంగతనం చేయడానికి ఉపయోగించిన ఒక కార్ (కారు టాటా ఇండికా విష్ఠ. TS-30-K-6255), ఒక త్రీ వీలర్ ఆటో (టీవీఎస్ ఆటో: TS 28 T 0763 ) , ఒక టాటా ఏస్ (. TS-24-TA-3792), ఒక బైక్ (బజాజ్ CT 110X బైక్ No. TS-10-FE-8294) పై నేరస్తులు మహబూబాబాద్ జిల్లాలోని జియో టవర్ వున్న గ్రామాలలో దొంగతనాలు చేసినాము మరియు ఇతర జిల్లాలలో జియో టవర్ వున్న గ్రామాలలో దొంగతనాలు చేసినాము, అట్టి టవర్ లు వున్నా గ్రామాల పేర్లు ఇప్పుడు గుర్తుకు రావడం లేదు అని తెలిపినారు.
దొంగతనాలకు పాల్పడిన జిల్లాల పరిధి వివరాలు సిద్ధిపేట – 16 జగిత్యాల – 24 జనగాం- 04 యాధాద్రి భువనగిరి – 03 సూర్యాపేట- 01 దొంగతనాలు జరిగినట్టు గుర్తించడం జరిగింది.
